Some Channels morphed visual of Sridevi lying in a bathtub, with Boney Kapoor looking on. The channel also ran a 'scene re-creation'. The media has been competing with each other on how to grab maximum ratings when discussing the actor.
నటి శ్రీదేవి మృతి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఆమె కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్లుగా భావించినప్పటికీ, మద్యం మత్తులో బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లుగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో శ్రీదేవి మృతిపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బాత్ టబ్‌లో పడి మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మీడియా ప్రతినిధులు కొందరు తమ తమ టీవీ చానళ్లలో ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపేందుకు చేసిన ప్రయత్నాలు విమర్శలకు తావిచ్చింది.
శ్రీదేవి మృతి నేపథ్యంలో కొందరు రిపోర్టర్లు బాత్ టబ్‌లలోకి దిగి సర్కస్ ఫీట్లు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. బాత్రూంలో శ్రీదేవి చివరి పదిహేను నిమిషాలు అని ఒకరు, బాత్ టబ్‌లోకి దిగి రిపోర్టింగ్ మరొకరు చేశారు.
తెలుగులో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ అయితే శ్రీదేవి బాత్ టబ్‌లో పడి ఉన్నట్లుగా చూపించింది. ఆమె బాత్ టబ్‌లో పడి ఉన్నప్పుడు బోనీ కపూర్ చూస్తున్నట్లుగా కూడా గ్రాఫిక్ చేశారు. అంతేకాదు, అల్కాహాల్ బాటిల్స్‌తోను సీన్ రీ కన్‌స్ట్రక్ట్ చేశారు.
ఇంగ్లీష్ చానల్స్‌లోను శ్రీదేవి బాత్ టబ్‌లో పడినట్లుగా గ్రాఫ్స్, సీన్ రీ కన్‌స్ట్రక్ట్ చేసే ప్రయత్నాలు చేశాయి. శ్రీదేవి టబ్ పక్కన నిల్చొని ఉండగా.. ఆమె కొలతలు, టబ్ కొలతలు కూడా ఇచ్చారట.
కొన్ని టీవీ ఛానల్స్ శ్రీదేవి మృతికి, సునంద పుష్కర్ మృతికి లింక్ చేస్తూ వార్తలు ఇచ్చాయి. ఇక తెలుగులో అయితే ఓ ఛానల్ రిపోర్టర్ బాత్ టబ్‌లో కూర్చొని ఇన్వెస్టిగేషన్ తీరును వివరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.